తెరాస మలేషియా ఆధ్వర్యంలో 'కేసీఆర్ దీక్షా దివస్'

Deeksha Divas Organized By TRS Malaysia NRI Wing - Sakshi

కౌలాలంపూర్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు దీక్షా దివస్. ఆ మహత్తర సందర్భాన్ని తెలంగాణ ప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్నారు. దీక్షా దివస్ చేపట్టి నవంబర్ 29తో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా.. మలేషియా ఎన్నారై విభాగం కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల పిలుపు మేరకు 'లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోం' అసోసియేషన్‌ని సందర్శించి అక్కడి చిన్నారులకు కావాల్సిన స్టేషనరీ, పండ్లు అందజేశారు. వెల్ఫేర్‌ హోంలోని పిల్లల ఆర్థిక అవసరాల నిమిత్తం రూ. 20,000 నగదు ఇవ్వడం జరిగింది. కార్యక్రమం ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు అధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎన్నారై విభాగం ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణ రావు నడిపెల్లి, రవితేజ, రఘునాథ్‌ నాగబండి, రవిందర్ రెడ్డి, హరీష్ గుడిపాటి, ఇతర సభ్యులు ఓం ప్రకాష్ బెజ్జంకి, శ్యామ్, సంతోష్ రెడ్డి, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top