
కోల్‌కతా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించనుందని ఆ రాష్ట్ర సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రశాంత్ కిశోర్‌ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్ముతో ఆయనకు ఎందుకు భద్రత కల్పిస్తారని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.