ఫుట్‌పాత్‌ షాప్‌ను ఢీకొట్టిన బస్సు.. యువకుడు మృతి | Youth killed as DTC bus hits footpath florist | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌ షాప్‌ను ఢీకొట్టిన బస్సు.. యువకుడు మృతి

Mar 12 2017 10:22 PM | Updated on Oct 4 2018 2:15 PM

ఢిల్లీ ఆర్టీసీ బస్సు ఫుట్‌పాత్‌ షాప్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆర్టీసీ బస్సు ఫుట్‌పాత్‌ షాప్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం పశ్చిమ ఢిల్లీలోని నంగోలయ్‌లో చోటు చేసుకుంది. నంగోలయ్‌- లజ్‌పత్‌ నగర్‌ రూట్‌లో నడిచే ఢిల్లీ రోడ్‌ రవాణసంస్థ బస్సు వేగంగా వెళ్లి ఫుట్‌పాత్‌ పై ఉన్న షాపును ఢీకొట్టింది.
 
దీంతో రాజు (25) అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులని సమీప ఆసుపత్రికి తరలించామని, వీరు శంకర్‌ (30), రాకేశ్‌(26), మిథున్‌(33)లని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నామని, డ్రైవర్‌, కండక్టర్‌లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement