రాందేవ్కు జెడ్ కేటగిరి భద్రత | Yoga guru Baba Ramdev gets 'Z' category security | Sakshi
Sakshi News home page

రాందేవ్కు జెడ్ కేటగిరి భద్రత

Nov 17 2014 9:46 PM | Updated on May 29 2019 2:58 PM

రాందేవ్కు జెడ్ కేటగిరి భద్రత - Sakshi

రాందేవ్కు జెడ్ కేటగిరి భద్రత

కేంద్ర ప్రభుత్వం యోగా గురు బాబా రాందేవ్కు జెడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం యోగా గురు బాబా రాందేవ్కు జెడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. రాందేవ్కు వస్తున్న బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రత సంస్థల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటివరకు రాందేవ్కు ఉత్తరాఖాండ్లో మాత్రమే జెడ్ కేటగిరి భద్రత కల్పించేవారని, ఇక నుంచి దేశ వ్యాప్తంగా ఆయన ఎక్కడికెళ్లినా ఇదే భద్రత ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. రాందేవ్ ఈ నెల 4న ప్రధాని నరేంద్ర మోదీని కలిశాక భద్రతను పెంచారు. ఆయన కోసం 40 మంది కమెండోలను కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement