కశ్మీర్‌లో మహిళా ఎస్పీవో కాల్చివేత

Woman special police officer shot dead in J&K's Shopian - Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లో శనివారం ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ఓ మహిళా స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌(ఎస్పీవో) ఇంట్లోకి దూరి ఆమెను కాల్చిచంపాయి. షోపియాన్‌ జిల్లాలోని వెహిల్‌ ప్రాంతానికి చెందిన ఖుష్బూ జాన్‌ విధులు ముగించుకుని శనివారం ఇంటికి చేరుకున్నారు. అప్పటివరకూ అక్కడే మాటేసిన ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడి అత్యంత సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. కుటుంబ సభ్యులు ఖుష్బూను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న భద్రతాబలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్‌సెర్చ్‌ ప్రారంభించాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top