యువతిపై ఉపసర్పంచి అత్యాచారం.. చిత్రీకరణ | woman gang raped in uttar pradesh | Sakshi
Sakshi News home page

యువతిపై ఉపసర్పంచి అత్యాచారం.. చిత్రీకరణ

May 12 2015 5:25 PM | Updated on Sep 3 2017 1:54 AM

యువతిపై ఉపసర్పంచి అత్యాచారం.. చిత్రీకరణ

యువతిపై ఉపసర్పంచి అత్యాచారం.. చిత్రీకరణ

ఉత్తరప్రదేశ్లోని అంబికాపూర్ గ్రామంలో దారుణం జరిగింది.

ఉత్తరప్రదేశ్లోని అంబికాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. 18  ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసిన గ్రామ ఉపసర్పంచి, మరొకరు ఆ దారుణాన్ని సెల్ఫోన్లలో వీడియో తీశారు. ఇదంతా పట్టపగలే జరిగింది.

గ్రామస్తుల సమాచారం మేరకు బాధితురాలి సోదరుడు, సమీప బంధువు పనికోసం వెళ్తుండగా నిందితులు వారిని బంధించారు. వారి దగ్గర ఉన్న 27 వేల రూపాయల మొత్తాన్ని దోచుకున్నారు. యువతిని అడవిలోకి రావాలని ఫోన్ చేయాలంటూ వారిద్దరిని బెదిరించారు. బాధితురాలు వారి చెప్పిన ప్రాంతానికి వెళ్లగా, నిందితులు ఇద్దరు ఆమె అన్న ఎదుటే అత్యాచారం చేశారు. ఈ దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మహమ్మద్ రషీద్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఉప సర్పంచి రంజాన్ అన్సారీ కోసం గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement