భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్ | Woman gangraped by four as husband held hostage on gunpoint | Sakshi
Sakshi News home page

భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్

Apr 9 2015 2:11 PM | Updated on Sep 3 2017 12:05 AM

భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్

భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్

అత్యాచార రాజధానిగా వార్తలకెక్కిన ఉత్తర ప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ జంట బైక్ పై వెళుతున్న క్రమంలో నలుగురు యువకులు అడ్డగించి తొలుత వారిపై దాడికి దిగారు.

ముజాఫర్ నగర్: అత్యాచార రాజధానిగా వార్తలకెక్కిన ఉత్తర ప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ జంట బైక్ పై వెళుతున్న క్రమంలో నలుగురు యువకులు అడ్డగించి తొలుత వారిపై దాడికి దిగారు. అనంతరం భర్తను తాళ్లతో చెట్టుకు కట్టేసి భార్య((23)పై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే.. గత రాత్రి ఓ కార్యక్రమానికి సంబంధించి షహనాపూర్ కు హాజరైన ఒక జంట తిరిగి షమ్లీకి వెళుతుండగా ఆ కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

 

భర్తను చెట్టుకు కట్టేసిన ఆ దుండగులు  భార్యను దగ్గర్లో ఉన్న తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు.  తరువాత వారి వద్ద ఉన్న నగదును కూడా అపహరించుకు పోయినట్లు సీనియర్ పోలీస్ సూపరిండెంట్ నితీష్ తివారీ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement