సెల్ఫీ తీస్తుండగా ప్రమాదం | While the risk as a selphi | Sakshi
Sakshi News home page

సెల్ఫీ తీస్తుండగా ప్రమాదం

Feb 26 2016 1:54 AM | Updated on Apr 3 2019 7:53 PM

గోవా పర్యటనకు వచ్చిన ఇద్దరు మహిళలు సెల్ఫీ కారణంగా తీవ్రంగా గాయపడ్డారు.

ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు

 పనాజి: గోవా పర్యటనకు వచ్చిన ఇద్దరు మహిళలు సెల్ఫీ కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం పనాజిలోని ఓ రిసార్టులో భవనం ఒకటో అంతస్తు వరకు వేసిన పరంజాపైకి 20 ఏళ్లకుపైబడిన ఇద్దరు మహిళలు ఎక్కారు. వారు తమ సెల్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటుండగా పరంజా ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో వారు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని మణిపాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళల వెన్నెముకలకు తీవ్రగాయాలయ్యాయని ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ శేఖర్ సల్కార్ తెలిపారు. ఆ మహిళల వివరాలు వెల్లడించేందుకు ఆసుపత్రి వర్గాలు నిరాకరించాయి. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement