ప్రభుత్వ ఆస్పత్రిలో పెళ్లి మోత | Wedding chime in public hospital | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రిలో పెళ్లి మోత

Mar 2 2016 12:11 AM | Updated on Oct 9 2018 7:11 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో పెళ్లి మోత - Sakshi

ప్రభుత్వ ఆస్పత్రిలో పెళ్లి మోత

ఉత్తరప్రదేశ్‌లోని బలంద్‌షహర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం రాత్రి నిర్వహించిన ఓ డీజే కార్యక్రమంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇబ్బందిపడ్డ రోగులు.. ఇద్దరు అధికారుల తొలగింపు
 
 బలరాంపూర్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని బలంద్‌షహర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం రాత్రి నిర్వహించిన ఓ డీజే కార్యక్రమం తో  రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రికి సంబంధించిన అధికారి కుటుంబానికి చెందిన ఓ పెళ్లి నేపథ్యంలో ఈ ఆటాపాటా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. పెద్దశబ్దాలతో డీజేతో సంగీత కార్యక్రమం నిర్వహించారు.

నిశ్శబ్దంగా ఉండాల్సిన ఆస్పత్రిలో పెళ్లిభాజాలు మోగడంతో ఆస్పత్రిలోని రోగులు విసిగిపోయారు. ఆస్పత్రి ఘటన తెలిసి చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్‌లను తొలగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎస్‌పీ యాదవ్ ఉన్నతాధికారులున ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో పెళ్లికి కారకులైన అందరిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదుచేయాలని ఆదేశాలిచ్చారు. ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటన భవిష్యత్తులో జరగకుండా జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement