రాహుల్‌ వైఫల్యాలపై వెబ్‌ సిరీస్‌

web series satire on Rahul, Sonia''s putra moh - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వైఫల్యాలపై వెబ్‌ సిరీస్‌ తీస్తానని మాజీ జర్నలిస్ట్, గతంలో కాంగ్రెస్‌తో కలసి పని చేసిన పంకజ్‌ శంకర్‌ అన్నారు. గతంలో ఈయన ప్రియాంకా గాంధీ మీడియా వ్యవహారాలను చూసేవారు. కాంగ్రెస్‌ను కష్టాల నుంచి ప్రియాంక గాంధీ మాత్రమే బయటపడేస్తారని ఎన్నికల సందర్భంగా చెప్పారు. అయితే సోనియా గాంధీ పుత్రప్రేమ వలన రాహుల్‌ గాంధీని ముందుకు తీసుకొచ్చారని అన్నారు. మూడు నెలల్లో ఈ సిరీస్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.  అయితే పంకజ్‌ పబ్లిసిటీ కోసం ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని కాంగ్రెస్‌ పేర్కొంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top