వర్గీకరణ సమస్త వర్గాల ఆకాంక్ష: మంద కృష్ణ | we want SC reservation classification, says mandakrishna | Sakshi
Sakshi News home page

వర్గీకరణ సమస్త వర్గాల ఆకాంక్ష: మంద కృష్ణ

Aug 10 2016 2:52 AM | Updated on Oct 8 2018 3:00 PM

వర్గీకరణ సమస్త వర్గాల ఆకాంక్ష: మంద కృష్ణ - Sakshi

వర్గీకరణ సమస్త వర్గాల ఆకాంక్ష: మంద కృష్ణ

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమాజంలోని సమస్త వర్గాల ఆకాంక్ష అని మంద కృష్ణ మాదిగ అన్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమాజంలోని సమస్త వర్గాల ఆకాంక్ష అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ఆందోళన మంగళవారం 22వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో పాల్గొన్న ముస్లిం సోదరులను ఉద్దేశించి మంద కృష్ణ మాట్లాడారు.

ఈ దీక్షలో ముస్లింలు సైతం పాల్గొనడం సంతోషకరమన్నారు. మాలలు అధిక సంఖ్యలో వర్గీకరణను సమర్థిస్తున్నారన్నారు. బుధవారం మహాధర్నా నిర్వహిస్తున్నట్టు దీనికి తెలుగు రాష్ట్రాల మాదిగలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement