నదిలో పడిపోయిన స్కూల్ బస్సు | Villagers saves 50 children from drowning bus in Bhilwara | Sakshi
Sakshi News home page

నదిలో పడిపోయిన స్కూల్ బస్సు

Aug 8 2016 12:16 PM | Updated on Sep 4 2017 8:25 AM

నదిలో పడిపోయిన స్కూల్ బస్సు

నదిలో పడిపోయిన స్కూల్ బస్సు

పాఠశాల బస్సు వరద ఉధృతికి నదిలో పడిపోయిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 50 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు.  రెండు రోజులుగా రాష్ట్రంలోని బిల్వారా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు స్థానికంగా నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఆచార్య విద్యాసాగర్ పాఠశాలకు చెందిన బస్సు సోమవారం ఓ చిన్న వంతెనను దాటుతుండగా.. నది ఉధృత ప్రవాహానికి అదుపుతప్పి నదిలో పడిపోయింది. బస్సు నీటిలో మునిగిపోతుండటం గమనించిన సమీపంలోని ప్రజలు చిన్నారులను కాపాడారు. స్థానికులు సకాలంలో సాహసంతో కూడిన పనిచేశారని చిన్నారుల తల్లిదండ్రులు, అధికారులు అభినందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement