
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సూక్మ్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) చేయూతనిచ్చి ఆదుకోవాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి సంబంధిత మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పనితీరుపై గురువారం రాజ్యసభలో కొనసాగిన చర్చలో పాల్గొన్న ఆయన భారత దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో మూడో వంతు భాగస్వామ్యం చిన్నపరిశ్రమలదేన్నారు. దేశంలోని మాన్యుఫాక్చరింగ్ రంగం మొత్తం ఉత్పాదనల్లో 45 శాతం వాటా రూ. 7.5 కోట్లు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలదేనని తెలిపారు. చిన్న పరిశ్రమల ద్వారా దేశంలో రూ. 11 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది కాబట్టి చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం నిలకడగా వృద్ధి చెందితేనే దేశ జీడీపీ వృద్ధి రేటు లక్ష్యాల సాధన సాధ్యపడుతుందని ఆయన అన్నారు. (ఏపీలో థియేటర్లు, మాల్స్ బంద్)
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎలాంటి ఆటుపోట్లకు గురికాకుండా వృద్ధి చెందడానికి ప్రధానంగా తీసుకోవలసిన కొన్ని చర్యలను విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. సాధారణంగా ఈ తరహా పరిశ్రమలు తమ ఉత్పాదనలకు చెల్లింపులు చేయడానికి కొనుగోలుదారులకు 90 రోజుల గడువు ఇస్తాయి. కానీ జీఎస్టీ నిబంధనల ప్రకారం ఇన్‌వాయిస్ ఇచ్చిన 20 రోజుల్లో జీఎస్టీ చెల్లంపులు జరగాలన్నారు. ఫలితంగా మూలధనం సమస్య ఈ పరిశ్రమలను నిత్యం వేధిస్తూ ఉంటుందని అన్నారు. అందువలన జీఎస్టీ చెల్లింపు, రిటర్న్స్ ఫైల్ చేసే విషయంలో ఎంఎస్‌ఎంఈకి నిబంధనలు సడలింపు కల్పించాలని కోరారు. అలాగే గడువు దాటిన చెల్లింపులకు విధించే జరిమానా వడ్డీని తగ్గించాలని కోరారు.(‘పరోక్షంగా తప్పు ఒప్పుకున్న నిమ్మగడ్డ’ )
చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధిలో రుణ సౌకర్యం కీలక పాత్ర పోషిస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. తక్కువ వడ్డీకి రుణం లభ్యమైనప్పుడే అవి పెద్ద పరిశ్రమలతో పోటీ అన్నారు. అయితే ఈ పరిశ్రమలు రిస్క్ కేపిటల్‌ను సేకరించలేకపోతున్నాయని, అలాగే బ్యాంక్‌లకు అవసరమైన కొలేటరల్ హామీని కూడా సమకూర్చలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. కాబట్టి రుణ సౌకర్యం పొందలేక ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు విలవిలలాడే పరిస్థితి ఏర్పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఆయన ఉదహరిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వాటి సైజును బట్టి రూ. 25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకుల నుంచి రుణ పొందే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. (నిర్భయ: ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’)
ఈ విధంగా ప్రభుత్వం హామీదారుగా ఉండి బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పిస్తున్నందున ఆంధ్రప్రదేశ్‌లో 6,572 చిన్నతరహా పరిశ్రమలు ఆవిర్భవించాయని అన్నారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ మంత్రిత్వ శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాల కారణంగా దేశంలో 80 లక్షల మంది మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కాగలిగారు. గడచిన అయిదేళ్ళలో వారి సంఖ్య 38 శాతం పెంచేందుకు కృషి చేజత్రి గడ్కరీని ఆయన అభినందించారు. అలాగే కొన్ని రకాల ఉత్పాదనలు కేవలం చిన్నపరిశ్రమలు మాత్రమే ఉత్పాదన చేసేలా రిజర్వ్ చేసి వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని శ్రీ విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. (కరోనా నివారణకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు)
ఎన్నాళ్లు తప్పించుకుంటావ్ బాబూ?
‘నిమ్మగడ్డకు ఈసీగా కొనసాగే అర్హత లేదు’