‘ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుంటే ఎంత బాగుందో’

Viarl Video: Peacocks Cause To Amazing Traffic Jam - Sakshi

నెమలి కనిపిస్తే ఎప్పుడు పురివిప్పి నాట్యం చేస్తుందా అని ఎదురు చుస్తాం.  అంత అద్భుతంగా ఉంటుంది మరి దాని అందం.  అదే పదుల సంఖ్యలో నెమళ్లు రోడ్లపైకి వచ్చి తిరుగుతుంటే ఎలా ఉంటుంది. చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. దేశమంతా లాక్‌డౌన్‌ ఉండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో అడవి జంతువులన్ని రోడ్లపైకి వచ్చి స్వేచ్ఛగా విహరించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల లాక్‌డౌన్‌కు సడలింపులు ఇచ్చిన అనంతరం రోడ్లపై వాహనాల రాకపోకలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో రద్దీగా ఉన్న రోడ్డుపైకి అనుకొని అతిథులు వచ్చి వాహనదారులకు కాస్తా ట్రాఫిక్‌ జామ్‌ కలిగించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోంది.

కొన్ని నెమళ్లు గుంపులుగా రోడ్డుపైకి అడ్డంగా వచ్చాయి. వాటిలో ఒకటి ఒక్కసారిగా పురివిప్పి అందంగా కనిపించింది. ఈ దృశ్యాలను భారతీయ అటవీశాఖ అధికారి పర్వీన్‌ కస్వాన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘జాతీయ పక్షితో అద్భుతమైన ట్రాఫిక్‌ జామ్’ అంటూ ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు దీనిని లక్షా ఇరవై వేల మంది వీక్షించారు. నెమళ్ల కారణంగా రోడ్డుపై వెళుతున్న వాహనాలకు కొంత ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అయితే దీనిని విసుగ్గా భావించకుండా ఆసక్తిగా తిలకిస్తున్నారు. ‘వావ్ .... ఎంత ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన ట్రాఫిక్ జామ్..  గంటల కొద్ది ట్రాఫిక్‌లో ఇరుకున్న ఇబ్బందిగా అనిపించదు. ’’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. (కరోనా : అనుకోని అతిధి వైరల్‌ వీడియో)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top