ఒక్క సిక్కింకే వెళ్లలేదు!

V-P Venkaiah Naidu visits 28 states in his first year as V-P - Sakshi

ఉపరాష్ట్రపతిగా ఏడాదిలో 28 రాష్ట్రాల్లో వెంకయ్య పర్యటన

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి నేడు ఏడాది  పూర్తిచేసుకుంటున్న వెంకయ్యనాయుడు అరుదైన ఘనత సాధించారు. ఆయనకు ముందు పదేళ్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్‌ అన్సారీ తన పదవీకాలంలో 26 రాష్ట్రాల్లో పర్యటించారు. కానీ వెంకయ్య ఏడాది కాలంలో ఒక్క సిక్కిం మినహా మిగిలిన 28 రాష్ట్రాల్లో పర్యటించారు. సిక్కిం పర్యటనకూ బయల్దేరిన వెంకయ్య ప్రతికూల వాతావరణం వల్ల అర్ధంతరంగా వెనుదిరిగారు. వెంకయ్య సిక్కిం మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించగా, అన్సారీ మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, అస్సాంలోనే పర్యటించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top