బుర్రా వెంకటేశం బాధ్యతల స్వీకరణ | Sakshi
Sakshi News home page

బుర్రా వెంకటేశం బాధ్యతల స్వీకరణ

Published Tue, Dec 19 2023 1:37 AM

Burra Venkatesham took charge as the Chief Secretary of  Education Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం సోమ వారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థల్లోని సమస్యలపై దృష్టి పెడతానన్నారు. ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ పాఠశాలల నుంచి వచ్చిన తాను విద్యాశాఖలో పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఉన్నత ప్రమాణాలు గల ప్రభుత్వ విద్య అవసరముందని, అందుకోసం సమాజం మేల్కొనాలని ఆయన పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలోని స్టేక్‌ హోల్డర్లందరినీ భాగస్వాములను చేసి ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తా నని, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఉద్యోగాలు పొందేందుకు కృషి చేస్తానని వెంకటేశం భరోసా ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement