కారు ప్రమాదంలో ఇద్దరు మృతి | Two killed in road mishap in Uttara pradesh, Sitapur | Sakshi
Sakshi News home page

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి

Apr 25 2016 5:32 PM | Updated on Sep 3 2017 10:43 PM

టైరు పేలిపోవడంతో కారు చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు.

సీతాపూర్(ఉత్తరప్రదేశ్): టైరు పేలిపోవడంతో కారు చెట్టుకు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన ఉత్తప్రదేశ్లోని బీబీపూర్ ప్రాంతంలోని మిస్రీక్ పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  ఓ ఫంక్షన్కు వెళ్లిన వారంతా కారులో తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో కారు టైర్ పేలిపోయింది.

దాంతో కారు అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ప్రశాంత్ తివారీ (25) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందగా, మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా గోపాల్ పాండే (42) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్టు పోలీస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా, గాయపడ్డ వారిలో నలుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement