లోక్ సభ సమావేశాలు రెండోరోజు వాడీవేడిగా ప్రారంభం అయ్యాయి. నల్లధనంపై చర్చకు విపక్షాలు పట్టు పట్టడంతో సభలో గందరగోళం నెలకొంది.
న్యూఢిల్లీ : లోక్ సభ సమావేశాలు రెండోరోజు వాడీవేడిగా ప్రారంభం అయ్యాయి. నల్లధనంపై చర్చకు విపక్షాలు పట్టు పట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. మంగళవారం సమావేశాలు ఆరంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్...కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే నల్లధనంపై చర్చకు అనుమతించాలంటూ విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే విపక్షాల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.