బీరు, బిర్యానీ తెస్తే ఓకే.. లేదంటే చచ్చారే..!

Top Official Transferred For Demanding Alcohol And Non Vegetarian Food - Sakshi

భోపాల్‌ : మద్యం, మాంసాహారం తీసుకురావాలని కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్న ఓ ఉన్నతాధికారిపై వేటు పడింది. జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు అందడంతో సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్న దిలీప్‌ మాండవి తన వద్దకు వచ్చే తహసీల్దార్‌, పట్వారీలు మద్యం, మాంసాహారం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నాడు. ఉట్టి చేతులతో వచ్చే వారిని నానా బూతులు తిడుతూ వేధింపులకు దిగుతున్నాడు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో అతన్ని డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top