20 డెంటల్ కాలేజీల గుర్తింపు రద్దు? | These medical colleges may lose registration for ragging menace | Sakshi
Sakshi News home page

20 డెంటల్ కాలేజీల గుర్తింపు రద్దు?

Jul 29 2016 2:03 PM | Updated on Oct 9 2018 6:57 PM

20 డెంటల్ కాలేజీల గుర్తింపు రద్దు? - Sakshi

20 డెంటల్ కాలేజీల గుర్తింపు రద్దు?

ర్యాగింగ్ను నియంత్రించలేకపోతున్న ఓ 20 డెంటల్ కాలేజీల గుర్తింపును రద్దు చేయనున్నారు. ఈ మేరకు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీసీఐ) కేంద్ర ఆరోగ్యశాఖకు ఓ లేఖ రాసింది.

న్యూఢిల్లీ: ర్యాగింగ్ను నియంత్రించలేకపోతున్న ఓ 20 డెంటల్ కాలేజీల గుర్తింపును రద్దు చేయనున్నారు. ఈ మేరకు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీసీఐ) కేంద్ర ఆరోగ్యశాఖకు ఓ లేఖ రాసింది. మొత్తం 20 కాలేజీలను రద్దు చేయాలని అందులో ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా ర్యాగింగ్ చట్టాలు తీసుకొచ్చి కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కొన్ని కాలేజీల్లో ఇప్పటికీ ఆ విష సంస్కృతి ప్రబలంగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నోసార్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసినప్పటికీ వాటిని కాలేజీ యాజమాన్యాలు బేఖాతరు చేస్తుండటంతో వాటి గుర్తింపు రద్దు చేయాలని డీసీఐ ప్రతిపాదనలు చేసింది.

డీసీఐ ప్రతిపాదించిన కాలేజీలు ఇవే..

  1. రీజినల్ డెంటల్ కాలేజీ, గువాహతి
  2. పాట్నా డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, పాట్నా
  3. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్, పాట్నా
  4. మిథిలియా మైనారిటీ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దర్భాంగ
  5. ఈఎస్ఐసీ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఢిల్లీ
  6. ప్రభుత్వ డెంటల్ కాలేజ్, శ్రీనగర్
  7. ఇందిరాగాంధీ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్, జమ్మూ
  8. కేజీఎఫ్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్, బీఈఎంఎల్ నగర్
  9. ఎఎంఈ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, రాయచూర్
  10. హితకారిణి డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, జబల్పూర్
  11. బాబా కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, భోపాల్
  12. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఔరంగబాద్
  13. నాందేడ్ రూరల్ డెంటల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ సెంటర్, నాందేడ్
  14. శ్రీ బాలాజీ డెంటల్ కాలేజీ, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
  15. రాజేశ్ రామ్ దాస్ జీ కాంబే డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అకోలా
  16. శ్రీ సుక్మని డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, డెరాబస్సి
  17. నిమ్స్ డెంటల్ కాలేజ్, జైపూర్
  18. ఫాకల్టీ ఆఫ్ డెంటల్ సైన్సెస్, కింగ్ జార్జ్ యూనివర్సిటీ ఆఫ్ డెంటల్ సైన్సెస్, లక్నో
  19. హరశరణ్ దాస్ డెంటల్ కాలేజీ, గజియాబాద్
  20. స్కూల్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, గ్రేటర్ నోయిడా.
    గత కొద్ది సంవత్సరాలుగా ఈ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు పెరగడంతోపాటు.. మరణాలు కూడా సంభవించాయని, ఈ నేపథ్యంలో వీటి గుర్తింపు రద్దు చేయాలని డీసీఐ ప్రతిపాదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement