సికార్‌లో రాళ్ల దాడి | Tension Prevails In Rajasthan Polling | Sakshi
Sakshi News home page

రాజస్ధాన్‌ పోలింగ్‌ : సికార్‌లో రాళ్ల దాడి

Dec 7 2018 3:13 PM | Updated on Dec 7 2018 4:45 PM

Tension Prevails In Rajasthan Polling - Sakshi

రాజస్ధాన్‌ పోలింగ్‌లో ఉద్రిక్తత

జైపూర్‌ : రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో కొన్నిప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. సికార్‌లో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీసులు లాఠీచార్జి జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇక రాజస్ధాన్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 41.39 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్‌ ఊపందుకుంటుందని అధికారులు చెబుతున్నారు.

పలు పోలింగ్‌ బూత్‌ల వద్ద ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాజస్ధాన్‌లో మొత్తం 199 అసెంబ్లీ స్ధానాలకు గాను 2274 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 51,667 పోలింగ్‌ కేంద్రాల్లో 4.47 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌లు అధికారపగ్గాలు చేపట్టేందుకు హోరాహోరీ తలపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement