అమర్నాథ్ యాత్ర.. తెలుగు యాత్రికులు క్షేమం | telugu pilgrims safe at amarnath yatra | Sakshi
Sakshi News home page

అమర్నాథ్ యాత్ర.. తెలుగు యాత్రికులు క్షేమం

Jul 10 2016 1:49 PM | Updated on Mar 28 2019 5:23 PM

అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు.

ఢిల్లీ: అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. శ్రీనగర్లో కర్ఫ్యూ కారణంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాకు చెందిన యాత్రికులు అవస్థలు పడిన విషయం తెలిసిందే. శ్రీనగర్ ఎస్పీతో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్ ఫోన్లో మాట్లాడారు. యాత్రికులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. షానీ రిసార్ట్ లో 128 తెలుగు యాత్రికులు ఉన్నారు. ఆర్మీ పర్యవేక్షణలో తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి యాత్రికులను ఇక్కడికి తీసుకొస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement