‘టట్రా’ కేసులో ఆంటోనీ వాంగ్మూలం నమోదు | Tatra case: CBI records statements of Antony, T K A Nair | Sakshi
Sakshi News home page

‘టట్రా’ కేసులో ఆంటోనీ వాంగ్మూలం నమోదు

May 7 2014 2:19 AM | Updated on Sep 2 2017 7:00 AM

‘టట్రా’ కేసులో ఆంటోనీ వాంగ్మూలం నమోదు

‘టట్రా’ కేసులో ఆంటోనీ వాంగ్మూలం నమోదు

టట్రా ట్రక్కుల కొనుగోలుకు సంబంధించి తనకు రూ. 14 కోట్ల లంచం ఇవ్వజూపారన్న ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ ఆరోపణల కేసులో రక్షణ మంత్రి ఆంటోనీ, ప్రధాని సలహాదారు టీకేఏ నాయర్ వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది.

న్యూఢిల్లీ: టట్రా ట్రక్కుల కొనుగోలుకు సంబంధించి తనకు రూ. 14 కోట్ల లంచం ఇవ్వజూపారన్న ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ ఆరోపణల కేసులో రక్షణ మంత్రి ఆంటోనీ, ప్రధాని సలహాదారు టీకేఏ నాయర్ వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. ‘వారి వాంగ్మూలాలను నమోదు చేశాం’ అని సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా మంగళవారం ఢిల్లీలో వెల్లడించారు. ప్రభుత్వరంగ సంస్థ బీఈఎంఎల్ నుంచి 1,600 టట్రా ట్రక్కుల కొనుగోలుకు ఆమోదం తెలిపితే రూ. 14 కోట్లు ఇస్తామని ఆర్మీ మాజీ ఉన్నతాధికారి తేజీందర్‌సింగ్ తనకు ఆశ చూపారని వీకే సింగ్ గతంలో బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇది పెద్ద సంచలనం కావడంతో దీనిపై సీబీఐ విచారణకు రక్షణశాఖ ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement