విధులకు దూరంగా సుప్రీంకోర్టు లాయర్స్ అసోసియేషన్‌

Supreme Lawyers Not To Work Till April 4 Due To Corona - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పనిచేయకూడదని సుప్రీంకోర్టు లాయర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. కరోనా ఉదృతి తరుణంలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, సుప్రీం కోర్టు రిజిస్టర్‌​ ఉద్యోగులు ఏప్రిల్‌ 4వరకు విధుల నిర్వహణకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. దేశ రాజధాని ఢిల్లీలో మార్చి 22 నుంచి 31 వరకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజా ఆరోగ్యం, భద్రత దృష్ణా చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించిన విషయం విదితమే.

చదవండి: నేనైతే ఫాంహౌజ్‌కు తీసుకువెళ్లి..: దోషుల లాయర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top