ఢిల్లీలో పగటివేళ మాత్రమే నిర్మాణాలు: సుప్రీంకోర్టు

Supreme Court Allows Construction in Daytime in Delhi-NCR - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ–నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్సీఆర్‌)లో జరుగుతున్న నిర్మాణాలపై ప్రస్తుతం అమలవుతున్న ఆంక్షలను సుప్రీంకోర్టు పాక్షికంగా ఎత్తివేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నిర్మాణాలు చేపట్టుకోవచ్చని స్పష్టంచేసింది. అయితే సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం స్పష్టం చేసింది. భవన నిర్మాణాలను, కూల్చివేతలను తాత్కాలికంగా ఆపివేయాలంటూ గత నెల 4న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top