తమిళ కాంగ్రెస్‌లో మద్దతు చిచ్చు | Support fight under the Tamil nadu congress | Sakshi
Sakshi News home page

తమిళ కాంగ్రెస్‌లో మద్దతు చిచ్చు

Feb 11 2017 2:45 AM | Updated on Mar 29 2019 9:31 PM

తమిళ కాంగ్రెస్‌లో మద్దతు చిచ్చు - Sakshi

తమిళ కాంగ్రెస్‌లో మద్దతు చిచ్చు

ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు అన్నాడీఎంకేలో సాగుతున్న సంక్షోభం తమిళ కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది.

  • శశికళకు మద్దతు ఇస్తామన్న టీఎన్‌సీసీ అధ్యక్షుడు
  • వ్యతిరేకిస్తున్న సీనియర్లు ∙ఢిల్లీకి చేరిన రాజకీయం
  • రాహుల్‌తో సమాలోచన
  • సాక్షి, చెన్నై: ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు అన్నాడీఎంకేలో సాగుతున్న సంక్షోభం తమిళ కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది. మెజారిటీ తగ్గిన పక్షంలో చిన్నమ్మ శశికళకు మద్దతిస్తామంటూ తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునా వుక్కరసుర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యల్ని తమిళ కాంగ్రెస్‌ సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. వ్యవహారం ఢిల్లీకి చేరడంతో నేతలు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ ముందు పంచాయితీ పెట్టారు. ప్రస్తు తానికి తటస్థంగా వ్యహరించడం మంచిదన్న రాహుల్‌ సూచనకు అంగీకరించారు.

    చిన్నమ్మకు మద్దతు
    ఎమ్మెల్యేలు శశికళకు మద్దతుగా ఓట్లు వేయా లని  తిరునావుక్కరసర్‌  గురువారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ సీనియర్లలో ఆగ్రహాన్ని రేపాయి. టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకే ఎస్‌ ఇళంగోవన్, కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత కేఆర్‌.రామస్వామి, సీనియర్‌ ఎమ్మెల్యే వసంత కుమార్‌ ఆయన వ్యాఖ్యలను దుయ్య బట్టారు. మిత్రపక్షం డీఎంకేతో కలసి వ్యూహాలకు పదునుపెట్టాలే గానీ, ఏకపక్ష నిర్ణయాలు తగదని హెచ్చరించడంతో నేతల మధ్య మాట ల తూటాలు పేలాయి. వ్యవహారం ముద రడంతో పంచాయితీ శుక్రవారం ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ పిలుపుతో చిదంబరం, ఈవీకేఎస్, కేఆర్‌.రామస్వామి, తిరునావుక్కరసుర్‌ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

    రాహుల్‌ సమాలోచన
    ఢిల్లీలో నేతలతో రాహుల్‌గాంధీ తమిళ రాజకీయ పరిస్థితులపై సమాలోచించారు.  అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. తటస్థంగా వ్యవహరించడం మంచిదన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సూచననే తన అభిప్రాయంగా రాహుల్‌ వ్యక్తం చేసినట్టు తెలిసింది. డీఎంకే తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగాలన్న ప్రతిపాదనను ఈవీకేఎస్‌ రాహుల్‌ ముందు ఉంచినట్టు ఆయన మద్దతుదారులు పేర్కొం టున్నాయి.

    పన్నీర్‌ వెనుక బీజేపీ హస్తం ఉన్నందున, శశికళకు మద్దతుగా నిలవడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో కలసి పనిచేయ డానికి వీలుంటుందన్న అభిప్రాయాన్ని తిరునావుక్కరసుర్‌ వ్యక్తం చేసినట్టు సమాచా రం.  అధిష్టానం నుంచి వచ్చే సూచనలు, సమాచారాల మేరకు ప్రతి ఒక్కరూ స్పందిం చాలని, అంతవరకు ఎవ్వరూ మాట్లాడవద్దం టూ రాహుల్‌ సూచించినట్టు తెలిసింది. ఈ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన తిరునావుక్కరసుర్‌ అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అని ముందుకు సాగడం గమనార్హం.

    కేడర్‌తో కెప్టెన్‌ మంతనాలు  
    సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నేతలతో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ శుక్రవారం అత్యవ సరంగా సమావేశం అయ్యారు.  పెరంబ లూరులో పార్టీ కోశాధికారి ఇళంగోవన్, నిర్వాహక కార్యదర్శి పార్థసారథిలతోపాటు అందుబాటులో ఉన్న జిల్లాల కార్యదర్శులతో సమావేశం అయ్యారు. అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ పరిస్థితులపై ఇందులో చర్చించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పన్నీరుకు మద్దతుగా స్పందించాలని ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు విజయకాంత్‌ దృష్టికి తీసుకెళ్లగా... ఆలోచించి నిర్ణయం తీసుకుందామని సూచించినట్టు ఆ పార్టీ నేతల ఒకరు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement