breaking news
Vijay Kant
-
తమిళ కాంగ్రెస్‌లో మద్దతు చిచ్చు
శశికళకు మద్దతు ఇస్తామన్న టీఎన్‌సీసీ అధ్యక్షుడు వ్యతిరేకిస్తున్న సీనియర్లు ∙ఢిల్లీకి చేరిన రాజకీయం రాహుల్‌తో సమాలోచన సాక్షి, చెన్నై: ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు అన్నాడీఎంకేలో సాగుతున్న సంక్షోభం తమిళ కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది. మెజారిటీ తగ్గిన పక్షంలో చిన్నమ్మ శశికళకు మద్దతిస్తామంటూ తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునా వుక్కరసుర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యల్ని తమిళ కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. వ్యవహారం ఢిల్లీకి చేరడంతో నేతలు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ ముందు పంచాయితీ పెట్టారు. ప్రస్తు తానికి తటస్థంగా వ్యహరించడం మంచిదన్న రాహుల్ సూచనకు అంగీకరించారు. చిన్నమ్మకు మద్దతు ఎమ్మెల్యేలు శశికళకు మద్దతుగా ఓట్లు వేయా లని తిరునావుక్కరసర్ గురువారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్లలో ఆగ్రహాన్ని రేపాయి. టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకే ఎస్ ఇళంగోవన్, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత కేఆర్.రామస్వామి, సీనియర్ ఎమ్మెల్యే వసంత కుమార్ ఆయన వ్యాఖ్యలను దుయ్య బట్టారు. మిత్రపక్షం డీఎంకేతో కలసి వ్యూహాలకు పదునుపెట్టాలే గానీ, ఏకపక్ష నిర్ణయాలు తగదని హెచ్చరించడంతో నేతల మధ్య మాట ల తూటాలు పేలాయి. వ్యవహారం ముద రడంతో పంచాయితీ శుక్రవారం ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ పిలుపుతో చిదంబరం, ఈవీకేఎస్, కేఆర్.రామస్వామి, తిరునావుక్కరసుర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాహుల్ సమాలోచన ఢిల్లీలో నేతలతో రాహుల్‌గాంధీ తమిళ రాజకీయ పరిస్థితులపై సమాలోచించారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. తటస్థంగా వ్యవహరించడం మంచిదన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సూచననే తన అభిప్రాయంగా రాహుల్ వ్యక్తం చేసినట్టు తెలిసింది. డీఎంకే తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగాలన్న ప్రతిపాదనను ఈవీకేఎస్ రాహుల్ ముందు ఉంచినట్టు ఆయన మద్దతుదారులు పేర్కొం టున్నాయి. పన్నీర్ వెనుక బీజేపీ హస్తం ఉన్నందున, శశికళకు మద్దతుగా నిలవడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో కలసి పనిచేయ డానికి వీలుంటుందన్న అభిప్రాయాన్ని తిరునావుక్కరసుర్ వ్యక్తం చేసినట్టు సమాచా రం. అధిష్టానం నుంచి వచ్చే సూచనలు, సమాచారాల మేరకు ప్రతి ఒక్కరూ స్పందిం చాలని, అంతవరకు ఎవ్వరూ మాట్లాడవద్దం టూ రాహుల్ సూచించినట్టు తెలిసింది. ఈ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన తిరునావుక్కరసుర్ అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అని ముందుకు సాగడం గమనార్హం. కేడర్‌తో కెప్టెన్ మంతనాలు సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నేతలతో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ శుక్రవారం అత్యవ సరంగా సమావేశం అయ్యారు. పెరంబ లూరులో పార్టీ కోశాధికారి ఇళంగోవన్, నిర్వాహక కార్యదర్శి పార్థసారథిలతోపాటు అందుబాటులో ఉన్న జిల్లాల కార్యదర్శులతో సమావేశం అయ్యారు. అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ పరిస్థితులపై ఇందులో చర్చించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పన్నీరుకు మద్దతుగా స్పందించాలని ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు విజయకాంత్ దృష్టికి తీసుకెళ్లగా... ఆలోచించి నిర్ణయం తీసుకుందామని సూచించినట్టు ఆ పార్టీ నేతల ఒకరు పేర్కొన్నారు. -
బీజేపీతోనే కెప్టెన్
పొత్తుకు సిద్ధమైన డీఎండీకే కూటమిగా ఎన్నికల్లోకి పెదవి విప్పిన విజయకాంత్ సాక్షి, చెన్నై : రానున్న లోక్‌సభ ఎన్నికలను కూటమిగా ఎదుర్కొనేందుకు నిర్ణయించినట్టు డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రకటించారు. బీజేపీతో కూటమి చర్చలు జరుపుతున్నామని గురువారం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతి పక్ష నేతగా ఉన్న డీఎండీకే అధినేత విజయకాంత్‌తో పొత్తుకు పలు పార్టీలు తహతహలాడుతున్నాయి. ఆ పార్టీకి రాష్ర్టంలో పది శాతం ఓటు బ్యాంక్ ఉండటం తమకు కలసి వస్తుందన్న ఆశతో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేలు ప్రయత్నించాయి. పలు దఫాలుగా డీఎండీకే కార్యాలయం మెట్లను డీఎంకే ప్రతినిధులు ఎక్కినా ఫలితం శూన్యం. దీంతో ఆ పార్టీని ఇక ఆహ్వానించబోమంటూ డీఎంకే తేల్చింది. అదే సమయంలో రాష్ట్రంలో ఒంటరిగా మిగిలిన కాంగ్రెస్ విజయకాంత్‌ను తమ అక్కన చేర్చుకునేందుకు తీవ్ర కుస్తీలు చేస్తూ వస్తున్నారు. అలాగే, బీజేపీ సైతం తమ కూటమిలోకి విజయకాంత్‌ను ఆహ్వానించేందుకు తీవ్ర ప్రయత్నాల్లో నిమగ్నం అయింది. రోజుకో కథనం పత్రికల్లో వచ్చినా డీఎండీకే అధినేత విజయకాంత్మాత్రం నోరు మెదపలేదు. మౌనంగానే అన్నింటినీ పరిశీలిస్తూ వచ్చారు. పలు దఫాలు మీడియా ముందుకు వచ్చిన విజయకాంత్‌ను ఆ కథనాల గురించి ప్రశ్నిస్తే, వాళ్లనే అడగండంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం. బీజేపీతో పొత్తు ఖరారైనట్టు వార్తలొచ్చినా ఆయన పట్టించుకోలేదు. బుధవారం బీజేపీ కూటమి ప్రకటన వాయిదా పడటంతో కాంగ్రెస్ వైపు విజయకాంత్ దృష్టి పెట్టినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఒంటరిగా ఆయన ఎన్నికల్లోకి వెళ్లనున్నారన్న వార్తలు ప్రచురితం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇంత వరకు తాను కూటమి గురించి ఏ ఒక్కరితోనూ చర్చించలేదని, ఏ పార్టీతోనూ ఇంత వరకు పొత్తు ఖరారు చేయలేదని గురువారం ప్రకటన విడుదల చేశారు. పొత్తుకు రెడీ: డీఎండీకే కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు రానున్న లోక్‌సభ ఎన్నికలను కూటమిగా ఎదుర్కొనేందుకు నిర్ణయించినట్టు ప్రకటించారు. బీజేపీతో కూటమిచర్చలు జరుపుతున్నామంటూ రెండు ముక్కల్లో ముగించడం గమనార్హం. అయితే, ఈ పొత్తుల చర్చ ఎన్ని మలుపులు తిరగనున్నదో వేచి చూడాల్సిందే. విజయకాంత్ డిమాండ్లకు ఇప్పటికే బీజేపీ తలొగ్గిన దృష్ట్యా, ఆ కూటమితో దోస్తీకట్టినట్టేనని డీఎండీకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ అధిష్టానంతో రాష్ర్ట పార్టీ శ్రేణులు గురువారం మంతనాలు జరపడం, డిమాండ్లు, సీట్ల పందేరం కొలిక్కి వచ్చినట్టుగా అక్కడి నుంచి వచ్చిన సంకేతాల మేరకు విజయకాంత్ ఈ ప్రకటన చేసినట్టు పేర్కొనడం గమనార్హం.