సునంద కుమారుడిని ప్రశ్నించిన పోలీసులు | Sunanda's son questioned by police | Sakshi
Sakshi News home page

సునంద కుమారుడిని ప్రశ్నించిన పోలీసులు

Feb 6 2015 4:36 AM | Updated on Sep 2 2017 8:50 PM

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు...

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గురువారం ఆమె కుమారుడు శివ్ మీనన్‌ను ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మీనన్ దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉన్న సిట్ కార్యాలయానికి వచ్చారు. మీనన్‌ను రెండుగంటలకుపైగా ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసును సునంద భర్త శశిథరూర్, ఆయన సిబ్బందిని మరోసారి ప్రశ్నించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement