‘నేతల నల్లధనం వివరాలను రాష్ట్రపతికి చెప్పా’ | subramanyam swamy said, The Black Money details are already given to Pranab mukharjee | Sakshi
Sakshi News home page

‘నేతల నల్లధనం వివరాలను రాష్ట్రపతికి చెప్పా’

Jul 11 2014 2:21 AM | Updated on Apr 3 2019 5:16 PM

‘నేతల నల్లధనం వివరాలను రాష్ట్రపతికి చెప్పా’ - Sakshi

‘నేతల నల్లధనం వివరాలను రాష్ట్రపతికి చెప్పా’

బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. దేశంలోని రాజకీయ నేతల నల్లధనానికి సంబంధించి తాను కనుగొన్న వివరాలను ఆయనకు వెల్లడించారు.

న్యూఢిల్లీ: బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. దేశంలోని రాజకీయ నేతల నల్లధనానికి సంబంధించి తాను కనుగొన్న వివరాలను ఆయనకు వెల్లడించారు. తమిళనాడులో గత 2 నెలల్లో జరిగిన హిందూ సంస్థల నేతల హత్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చానని ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చిన శ్రీలంక తమిళులు తమిళనాడులోకి చొరబడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకునేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని కోరాను. ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్ల ఇస్లామిక్ రాజ్యం(ఖలీఫేట్)లో తమిళనాడు ముస్లింలు చేరారని తెలిపాను. వీటిని అరికట్టేందుకు రాజ్యాంగంలోని 256 అధికరణ కింద రాష్ట్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశాను’ అని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement