జల్లికట్టుకు అనుమతిపై సోమవారం సుప్రీంకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలు అయ్యాయి.
ఢిల్లీ/తమిళనాడు: జల్లికట్టుకు అనుమతిపై సోమవారం సుప్రీంకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. జల్లికట్టుకు అనుమతిని సవాల్ చేస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే జల్లికట్టుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళులకు ఎంతో ప్రీతిపాత్రమైన జల్లికట్టును పొంగల్ పండుగల్లో జరుపుకోనిదే సందడే ఉండదని భావిస్తారు.
జల్లికట్టు నిబంధనలను సడలించి క్రీడా నిర్వహణకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు, ప్రజలు ఏడాదిన్నరగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అన్ని పార్టీలతోపాటు అధికార బీజేపీ నేతల నుంచి సైతం ఒత్తిళ్లు పెరగడంతో దిగొచ్చిన కేంద్రం ఇటీవలే జల్లికట్టుకు షరతులతో కూడిన అనుమతులను జారీచేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ జంతుప్రేమికులు మళ్లీ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.