అదృష్టం.. అంతే?! | Shock plane crashes | Sakshi
Sakshi News home page

అదృష్టం.. అంతే?!

Sep 12 2017 4:06 PM | Updated on Apr 4 2019 3:25 PM

అదృష్టం.. అంతే?! - Sakshi

అదృష్టం.. అంతే?!

నిజంగా భూమ్మీద నూకలు మిగిలి ఉంటే.. ఎటువంటి ప్రమాదంలో చిక్కుకున్నా బతికేస్తాం. విమానం నుంచి కిందపడ్డా.. మహాసముద్రంలో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయినా.. ప్రాణాలతో బయటపడతాం.

సాక్షి, వాషింగ్టన్‌ : నిజంగా భూమ్మీద నూకలు మిగిలి ఉంటే.. ఎటువంటి ప్రమాదంలో చిక్కుకున్నా బతికేస్తాం. విమానం నుంచి కిందపడ్డా.. మహాసముద్రంలో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయినా.. ప్రాణాలతో బయటపడతాం. మీరు నమ్మినా.. నమ్మకపోయినా.. సరిగ్గా ఇటువంటి ప్రమాదం నుంచి కొందరు ప్రాణాలతో బయటపడ్డారు.. అది కూడా విమాన ప్రమాదంనుంచి..
అమెరికాలోని ప్లెయిన్‌విల్లే ప్రాంతంలో ఒక ఆసుపత్రి ఉంది. మంగళవారం ఆ ఆసుపత్రి ముందు.. ఒక తేలికపాటి విమానం చక్క్ర్లు కొడుతోంది. చూసిన జనాలు దానిని పట్టించుకోలేదు. ఇంతలో హఠాత్తుగా అదుపు తప్పిన విమానం..  నేరుగా చెట్టును ఢీకొట్టింది. చిత్రంగా ఆ విమానం ఎటువంటి కార​ పర్కింగ్‌లో పార్క్‌ చేసినట్లు చక్కగా పార్కింగ్‌ప్లేస్‌లో ల్యాండయింది. ఆ విమానంలో ప్రయాణిస్తునన మ్యాన్‌ఫ్రెడ్‌ ఫ్రాస్ట్‌ సహా మరో ఇద్దరికి చిన్నచిన్న గాయాలయ్యాయి. వీరంతా ఎదురుగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స తీసుకుని చక్కా ఇంటికి పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement