వివాదాస్పదులపై వేటు-కొత్తవారికి చోటు | Shiv Sena replaces senior spokespersons Sanjay Raut, Manohar Joshi by five new faces | Sakshi
Sakshi News home page

వివాదాస్పదులపై వేటు-కొత్తవారికి చోటు

Nov 21 2014 10:52 PM | Updated on Sep 2 2017 4:52 PM

శివసేన నాయకులైన మనోహర్ జోషి, సంజయ్‌రావుత్‌లను అధికార ప్రతినిధి పదవుల నుంచి తప్పించారు.

సాక్షి, ముంబై: శివసేన నాయకులైన మనోహర్ జోషి, సంజయ్‌రావుత్‌లను అధికార ప్రతినిధి పదవుల నుంచి తప్పించారు. పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొనేవిధంగా చేసిన కారణంగానే వీరిని తప్పించి ఉండొచ్చని భావిస్తున్నారు.వీరితోపాటు సుభాష్ దేశాయి, శ్వేతా పారుల్కర్‌లని కూడా ఈ పదవి నుంచి తప్పిం చారు.

ఈ నేపథ్యంలో శివసేన కొత్తగా ఆరుగురు అధికార ప్రతినిధుల పేర్లను ప్రకటించింది. వీరిలో ముఖ్యంగా గతంలో ఉన్నవారిలో నీలం గోరే మినహా మిగతా వారంతా కొత్తవారే. వీరంతా యువకులే. కొత్త అధికార ప్రతినిధులలో ఎంపీ అరవింద్ సావంత్, అమోల్ కోల్హే, విజయ్ శివతారే, మనీషా కాయిందే, అరవింద భోస్లే ఉన్నారు. సంజయ్ రావుత్‌తోపాటు మనోహర్ జోషి గతంలో ఓ పర్యాయం చేసిన వ్యాఖ్యలపై కారణంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చే సిన సంగతి విదితమే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement