‘రాఫెల్‌’పై విచారణకు సుప్రీం అంగీకారం

SC to hear plea seeking stay on Rafale deal next week - Sakshi

న్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే వారం ఈ పిటిషన్‌ను విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ప్రకటించింది. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న న్యాయవాది ఎంఎల్‌ శర్మ విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రాఫెల్‌ ఒప్పందంలో పలు లొసుగులు ఉన్నాయని, దాని అమలుపై స్టే విధించాలని శర్మ కోర్టును కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్, వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ, ఫ్రెంచ్‌ రక్షణ సంస్థ డసాల్ట్‌లపై కేసులు నమోదుచేసి విచారించాలని కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top