ఆధార్ కార్డులను గుర్తింపు కార్డులుగా ఆమోదించడం మొదలయ్యాక వేల కోట్లలో ప్రభుత్వ నిధులు ఆదా అవుతున్నాయి.
వచ్చింది 'ఆధారం'.. మిగిల్చింది కోట్ల ఆదాయం!
Apr 4 2016 7:27 PM | Updated on Sep 15 2018 4:12 PM
ఆధార్ కార్డులను గుర్తింపు కార్డులుగా ఆమోదించడం మొదలయ్యాక వేల కోట్లలో ప్రభుత్వ నిధులు ఆదా అవుతున్నాయి. గతంలో ఆయా శాఖల కింద పెట్టిన ఖర్చులతో పోల్చితే గత చట్టాల్లోని డొల్లతనం బయటపడుతోంది.
పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖకు చెందిన నిధుల్లో ఆధార్ అమలు తర్వాత రూ.14,672 కోట్ల మిగులు కనిపించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, ఢిల్లీ రాష్ట్రాల్లోని ప్రజా పంపిణీ వ్యవస్థలో రూ.2,346కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ల్లో స్కాలర్షిప్ల్లో రూ.276 కోట్లు, జాతీయ సామాజిక ప్రోత్సహం కింద జార్ఖండ్, చండీఘడ్, పుదుచ్చేరి ప్రభుత్వాలు కేటాయించిన నిధుల్లో రూ. 66 కోట్లు మిగిలాయి.
Advertisement
Advertisement