దేశవ్యాప్తంగా గోవధ నిషేధం | RSS chief calls for nationwide ban on cow slaughter | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా గోవధ నిషేధం

Apr 10 2017 1:20 AM | Updated on Mar 29 2019 9:31 PM

దేశవ్యాప్తంగా గోవధ నిషేధం - Sakshi

దేశవ్యాప్తంగా గోవధ నిషేధం

దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం అమలులోకి తీసుకురావాలని రాష్ట్రీ య స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ డిమాండ్‌ చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భాగవత్‌ డిమాండ్‌
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం అమలులోకి తీసుకురావాలని రాష్ట్రీ య స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ డిమాండ్‌ చేశారు. గోవధ పేరుతో ఏరకమైన హింసనూ అంగీకరించేది లేదని, ఇందుకోసం ఒక చట్టం తీసుకురావా లని అన్నారు. గో పరిరక్షణ పేరుతో హిం సకు పాల్పడటాన్ని తప్పుబట్టిన ఆయన.. దీని వల్ల అసలు లక్ష్యం పక్కదారి పడుతోం దని చెప్పారు. గోపరిరక్షణకు సంబంధిం చిన చర్యలను మరింత ముమ్మరం చేయాలని, అయితే వీటిని పూర్తిగా చట్టానికి, రాజ్యాంగానికి లోబడి కొనసాగించాలని సూచించారు.

కొద్ది రోజుల క్రితం బీజేపీ పాలిత రాష్ట్రమైన రాజస్తాన్‌లోని ఆల్వార్‌లో ఓ ముస్లిం వ్యక్తి గో సంరక్షకుల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మహావీర్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భాగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలుగోవధ నిషేధ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లయితే మిగిలిన రాష్ట్రాలూ దానిని అనుసరించే అవకాశం ఉందన్నారు. అయితే రాజకీయపరమైన కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలులోకి రావడానికి  సమయం పడుతుందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement