ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హై అలర్ట్‌!

Report Says Delhi On High Alert Over Possible Terror Attack - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానికి ఉగ్ర ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అక్కడ హైలర్ట్‌ విధించినట్లు సమాచారం. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసు వర్గాలు మార్కెట్‌, ఆస్పత్రి ఏరియాల్లో భద్రత కట్టుదిట్టం చేశాయి. క్రైం ప్రత్యేక విభాగంతో పాటు అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.(కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం)

కాగా గల్వాన్‌ లోయ ప్రాంతంలో ఘర్షణ వాతావరణాన్ని ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని ఇంటలెజిన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు నలుగురు ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించే ఆస్కారం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్, కుల్గామ్‌ జిల్లాల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. వీరంతా హిజ్బుల్‌ ముజాహిదీన్, ఐసిస్‌లకు చెందిన వారు.(కరోనా పేరిట సైబర్‌ నేరాలకు ఆస్కారం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top