కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం | Four terrorists killed in two separate encounters Jammu Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

Jun 22 2020 6:16 AM | Updated on Jun 22 2020 6:32 AM

Four terrorists killed in two separate encounters Jammu Kashmir - Sakshi

ఎన్‌కౌంటర్‌ తర్వాత జవాన్ల విజయనాదం

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, కుల్గామ్‌ జిల్లాల్లో జరిగిన రెండు ఎన్‌ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హత మయ్యారు. మృతుల్లో ఒకరిని షకూర్‌ ఫరూక్‌ లాంగూగా గుర్తించారు. గత మే 20న ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లను చంపిన కేసులో నిందితుడు. బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ కు చెందిన రైఫిల్‌ను సైతం జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో హతుడు షహీద్‌ అహ్మద్‌ భట్‌ కాగా, ఇంకొకరిని గుర్తించాల్సి ఉంది. వీరు హిజ్బుల్‌ ముజాహిదీన్, ఐసిస్‌లకు చెందిన వారు. అలాగే, కుల్గామ్‌ జిల్లాలో తయాబ్‌ వలీద్‌ అలియాస్‌ ఇమ్రాన్‌ భాయ్, అలియాస్‌ గజీ బాబా అనే పాకిస్తానీ హతమయ్యాడు. జైషే మొహమ్మద్‌ కమాండర్‌గా ఉన్న ఇతడు బాంబుల తయారీలో సిద్ధహస్తుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement