త్వరలో మరణ నమోదు రిజిస్ట్రీ | Registration of death registry was coming Soon | Sakshi
Sakshi News home page

త్వరలో మరణ నమోదు రిజిస్ట్రీ

Dec 28 2016 3:07 AM | Updated on Sep 4 2017 11:44 PM

దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో సంభవిస్తున్న మరణాలు, వాటి కారణాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని భద్రపరిచే జాతీయ మరణాల రిజిస్ట్రీని ఆరోగ్య శాఖ ఎయిమ్స్‌తో కలిసి రూపొందించనుంది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో సంభవిస్తున్న మరణాలు, వాటి కారణాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని భద్రపరిచే జాతీయ మరణాల రిజిస్ట్రీని ఆరోగ్య శాఖ ఎయిమ్స్‌తో కలిసి రూపొందించనుంది. వేర్వేరు ప్రాంతాల్లో చావులకు కారణాలు తెలిస్తే వ్యాధులపై విధాన రూపకర్తలకు పూర్తి అవగాహన కలిగి, ఆరోగ్య వసతులు, ఇతర వనరులను సమర్థంగా వినియోగించుకునే వీలు కలుగుతుందని ఎయిమ్స్‌ కంప్యూటరీకరణ చైర్మన్‌ దీపక్‌ అగర్వాల్‌ చెప్పారు.

ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించబోతున్నట్లు ఆరోగ్య శాఖ అధికారి చెప్పారు. ప్రస్తుతం పూర్తి సమాచారం లేదని, ఈ వ్యవస్థ అమలైతే రోగుల వివరాలు, మరణాలకు కారణాలతో పూర్తి వివరాలు అందుబాటులోకొస్తాయని వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement