జాలర్ల వలలో అరుదైన చేప | Rare fish in Fishermen trap | Sakshi
Sakshi News home page

జాలర్ల వలలో అరుదైన చేప

Jun 25 2014 8:30 PM | Updated on Sep 2 2017 9:23 AM

జాలర్ల వలకు చిక్కిన అరుదైన చేప

జాలర్ల వలకు చిక్కిన అరుదైన చేప

జాలర్ల వలలో అరుదైన చేప చిక్కుకుంది. తమిళనాడు రాష్ట్రం పొన్నేరి సమీపంలోని అలంగాకుప్పానికి చెందిన దేశాస్పన్ నేతృత్వంలో జాలర్ల బృందం వారం రోజులుగా సముద్రంలో చేపల వేట సాగిస్తోంది.

 గుమ్మిడిపూండి(తమిళనాడు): జాలర్ల వలలో అరుదైన చేప చిక్కుకుంది. తమిళనాడు రాష్ట్రం పొన్నేరి సమీపంలోని అలంగాకుప్పానికి చెందిన దేశాస్పన్ నేతృత్వంలో జాలర్ల బృందం వారం రోజులుగా సముద్రంలో చేపల వేట సాగిస్తోంది. వారు వేసిన వలలో రెండు రోజుల క్రితం రాక్షసజాతికి చెందిన ఓ అరుదైన చేప పడింది.

బుధవారం దీన్ని జాలర్లు సముద్ర తీరానికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే అది మృతి చెందింది. చాలా విచిత్రంగా ఉన్న ఈ చేప బరువు 150 కిలోలు ఉంది. ఈ చేప జాతిని కొనుగొనేందుకు, దీన్ని చెన్నై మత్స్యశాఖ పరిశోధన కేంద్రానికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement