ఇక నుంచి లౌడ్‌స్పీకర్లు బంద్‌..!

Punjab Haryana High Court Orders To Ban Loudspeakers At Public Places - Sakshi

చంఢీగర్‌ : అవసరం ఉన్నా.. లేకపోయినా.. అంతెత్తు లౌడ్‌స్పీకర్ల హోరుతో ప్రజల అనారోగ్యానికి కారణమయ్యేవారికి ఇక మూడినట్లే..! బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్ల వాడకాన్ని నిషేదిస్తూ పంజాబ్‌-హరియాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు కూడా లౌడ్‌స్పీకర్లను వాడాలంటే  రాతపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఆద్యాత్మిక కేంద్రాల్లో కూడా రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఎలాంటి స్పీకర్లు పెట్టరాదని వెల్లడించింది. ఏడాది మొత్తంలో పండుగల సమయంలో 15 రోజులు లౌడ్‌స్పీకర్ల వాడకానికి వెసులుబాటు కల్పించింది. పండుగల సమయంలో రాత్రి 10 నుంచి అర్ధరాత్రి వరకు లౌడ్‌స్పీకర్లు వాడుకోవచ్చని తెలిపింది. జస్టిస్‌ రాజీవ్‌ శర్మ, జస్టిస్‌ హరీందర్‌ సింగ్‌ సిద్ధూ ఈ మేరకు రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించకుండా... శబ్ద కాలుష్య నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top