బ్రిటన్‌ రాకుమారుడి పెళ్లి... ముంబైలో షాపింగ్‌

Prince Harry And Prince Makle Doing Shopping In Mumbai - Sakshi

సాక్షి, ముంబై : బ్రిటన్‌ రాకుమారుడు హ్యారి, రాకుమారి మెఘాన్‌ మార్కల్‌ గురువారం ముంబైలో షాపింగ్‌ చేశారు. అయితే వారి పెళ్లికి సంబంధించిన ఈ షాపింగ్‌లో ముంబై డబ్బావాలాలు కూడా పాల్గొన్నారు. బ్రిటన్‌ రాకుమారిడి కుటుంబానికి, డబ్బావాలా వారికి అనుబంధం 2003లో మొదలైంది. ప్రిన్స్‌ చార్లెస్‌ తొలిసారిగా 2003లో ముంబైకి వచ్చారు. అప్పుడు వారి పనితనాన్ని, పని పట్ల వారికి ఉన్న నిబద్ధతను చూసి ముగ్దుడైపోయారు. 2005లో జరిగిన చార్లెస్‌, కెమిల్లా పార్కర్‌ వివాహానికి హాజరు కావల్సిందిగా డబ్బావాలాలను ఆహ్వానించారు. 

ప్రస్తుతం హ్యారి పెళ్లి షాపింగ్‌కు ఈ డబ్బావాలాలు కూడా హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులైన కుర్తా పైజామా, పెళ్లి చీరలు, మంగళసూత్రం, ఆకుపచ్చ గ్లాస్‌ గాజులను రాకుమారుడి దంపతులకు బహూకరించనున్నట్లు ముంబై డబ్బావాలా అసోసియేషన్‌ అధికారి ప్రతినిధి సుభాశ్‌ తలెకర్‌ తెలిపారు. ఈ పెళ్లి సందర్భంగా ముంబైలోని ప్రభుత్వాసుపత్రిల్లో స్వీట్లు పంచుతామని డబ్బావాలాలు చెప్పారు. 33 ఏళ్ల హ్యారి, 36 ఏళ్ల మార్కల్‌ను మే 19న వివాహాం చేసుకోబోతున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top