గుజరాత్‌ అల్లర్లే బీజేపీని ఓడించాయి!

Pranab Mukherjee reveals BJP defeat

2004 ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ

న్యూఢిల్లీ: 2002 నాటి గుజరాత్‌ అల్లర్లు నాటి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వానికి అతి పెద్ద దెబ్బ అయి ఉండొచ్చని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభిప్రాయపడ్డారు. వీటి ప్రభావం 2004 నాటి ఎన్నికలపై పడిందని పేర్కొన్నారు. తాను రాసిన ‘ ది కోయిలిషన్‌ ఇయర్స్‌ 1992–2012‘ పుస్తకం మూడో వాల్యూంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

పాలక ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సమయంలో చేపట్టిన షైనింగ్‌ ఇండియా’ ప్రచారం వ్యతిరేక ఫలితాలిచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం రామమందిర నిర్మాణం అంశం బాగా ప్రచారంలోకి వచ్చిందని, 2002లో గుజరాత్‌లో జరిగిన మతకలహాలు రక్తపాతానికి దారితీశాయని అందులో ప్రణబ్‌ చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top