కొరియర్‌ ద్వారా దేశంలోకి రద్దయిన నోట్లు | Old notes from abroad are taking the courier route in | Sakshi
Sakshi News home page

కొరియర్‌ ద్వారా దేశంలోకి రద్దయిన నోట్లు

Jan 14 2017 2:39 AM | Updated on Sep 5 2017 1:11 AM

ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లను వాడుకలోకి తెచ్చేందుకు విదేశాల్లోని భారతీయులు అక్రమ మార్గాల బాట పట్టారు. కొరియర్‌ పార్సిళ్లలో నోట్లు ఉంచి రవాణా చేశారు.

బనశంకరి (బెంగళూరు): ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లను వాడుకలోకి తెచ్చేందుకు విదేశాల్లోని భారతీయులు అక్రమ మార్గాల బాట పట్టారు. కొరియర్‌ పార్సిళ్లలో నోట్లు ఉంచి రవాణా చేశారు.  డిసెంబర్‌ 30 వరకు బెంగళూరులోని కెంపేగౌడ  విమానాశ్రయంలో రూ.1.24కోట్ల విలువైన పాత కరెన్సీని పట్టుబడ్డాయి.

విదేశాల్లో ఉన్న కొంత మంది తమ వద్ద ఉన్న పాతపెద్దనోట్లను మొబైల్‌ ఫోన్‌ బాక్సులు, పుస్తకాలు ఇతర వస్తువుల్లో దాచి కొరియర్‌ ద్వారా బెంగళూరులోని తమ వారికి చేరవేస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులకు సమాచారమందింది. దీంతో వారు వివిధ దేశాల నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరిన కొరియర్‌ పార్శిళ్లను తనిఖీ చేయగా నోట్లు బయటపడ్డాయి. ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement