బంగారం నిక్షేపాలు అబద్ధం: జీఎస్‌ఐ

No Discovery of 3000-tonne Gold Deposits in Uttar Pradesh is Sonbhadra - Sakshi

కోల్‌కతా/సోన్‌భద్ర: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3వేల టన్నుల బంగారం నిల్వలు బయటపడ్డాయంటూ వచ్చిన వార్తలు వట్టివేనని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ)స్పష్టం చేసింది. ‘సోన్‌భద్రలో అంత భారీగా బంగారు నిల్వలను మేం కనుగొనలేదు. అటువంటి సమాచారమేదీ మేం ఇవ్వలేదు’ అని జీఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.శ్రీధర్‌ కోల్‌కతాలో శనివారం మీడియాకు తెలిపారు. తమ అన్వేషణలో ఇదే జిల్లాలో దాదాపు 52వేల టన్నుల ఇనుప ఖనిజం బయటపడిందనీ, ఇందులో టన్నుకు 3.03 గ్రాముల చొప్పున సాధారణ స్థాయిలో బంగారం ఉన్నట్లు తేలిందన్నారు. బహుశా ఈ వార్తనే సోన్‌భద్ర జిల్లా అధికారులు మరోలా వెల్లడించి ఉంటారని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top