మోదీ కేబినెట్‌ తుది భేటీ : వరాలపై ఉత్కంఠ

Narendra Modi To Hold Last Cabinet Meeting Today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో గురువారం చిట్టచివరి కేబినెట్‌ భేటీ జరగనుంది. ప్రధాని మోదీ నివాసంలో జరిగే కేబినెట్‌ సమావేశంలో భారీ వరాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా సంస్ధల్లో అగ్రవర్ణ పేదలకు పది శాతం కోటా అమలుకు రూ 4000 కోట్ల అదనపు కేటాయింపులకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు.

ఇక యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీల రిజర్వేషన్‌లకు సంబంధించి 200 పాయింట్‌ రోస్టర్‌ వ్యవస్థ పునరుద్ధరణకు ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రజాకర్షక వరాలనూ ఈ భేటీ ద్వారా ప్రకటించి పూర్తిస్ధాయిలో ఎన్నికల క్షేత్రంలో అడుగుపెట్టాలని మోదీ సర్కార్‌ యోచిస్తోంది.

కాగా ఈనెల 9 లేదా 11న ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే లోగా మరికొన్ని వరాలతో ఆకట్టుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా గురువారం కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఉండవచ్చని ఆశిస్తున్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం ప్రధాని మోదీ నాగపూర్‌ మెట్రో 13.5 కిలోమీటర్ల ఫేజ్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభిస్తారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top