కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వ్యవహారాల మంత్రి, లోక్ జనశక్తి పార్టీ నేత రాంవిలాస్ పాశ్వాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ : కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వ్యవహారాల మంత్రి, లోక్ జనశక్తి పార్టీ నేత రాంవిలాస్ పాశ్వాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ రాంవిలాస్ పాశ్వాన్ 69వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్‌లో అభినందనలు తెలుపుతూ ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాంవిలాస్ పాశ్వాన్...ప్రధానికి రీట్విట్ చేశారు. 'వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ రిగార్డ్ టూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ జీ' అంటూ పాశ్వాన్ ట్విట్ చేశారు.