జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ములాయం | Mulayam in Gurgaon hospital | Sakshi
Sakshi News home page

జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ములాయం

Jun 27 2015 2:12 PM | Updated on Sep 3 2017 4:28 AM

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ (75) తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారు.

లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ (75) తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం అస్వస్థతకు గురైన ములాయం గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చినట్టు వైద్య వర్గాలు చెప్పాయి.

వైద్య పరీక్షల అనంతరం మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని ములాయంకు సూచించినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. కాగా సాధారణ పరీక్షల కోసమే ములాయం ఆస్పత్రికి వెళ్లినట్టు సమాజ్వాదీ పార్టీ వర్గాలు చెప్పాయి.

Advertisement
 
Advertisement
Advertisement