‘మీడియా మా ఇంటిపైనే పడింది.. అందుకే ఓడాం’ | Mulayam blames media, voters for SP's defeat in UP polls | Sakshi
Sakshi News home page

‘మీడియా మా ఇంటిపైనే పడింది.. అందుకే ఓడాం’

Apr 16 2017 3:03 PM | Updated on Apr 3 2019 3:50 PM

‘మీడియా మా ఇంటిపైనే పడింది.. అందుకే ఓడాం’ - Sakshi

‘మీడియా మా ఇంటిపైనే పడింది.. అందుకే ఓడాం’

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో తమ ఓటమికి మీడియా, ఓటర్లు కారణమని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ అన్నారు. తమ కుటుంబ వివాదంపైనే మీడియా తన దృష్టిని కేంద్రీకరించిందని, ప్రజలంతా బీజేపీ చేతిలో మూర్ఖులయ్యారని విమర్శించారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో తమ ఓటమికి మీడియా, ఓటర్లు కారణమని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ అన్నారు. తమ కుటుంబ వివాదంపైనే మీడియా తన దృష్టిని కేంద్రీకరించిందని, ప్రజలంతా బీజేపీ చేతిలో మూర్ఖులయ్యారని విమర్శించారు. అఖిలేశ్‌ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిన ప్రజలు బీజేపీ ప్రభావానికి లోనై ఓటమిని కట్టబెట్టారని ఆరోపించారు.

చల్‌ మోదీ, చల్‌ మోదీ అనే పిలుపుతో ప్రజలు మూర్ఖులుగా మారి బీజేపీతో వెళ్లిపోయారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో పార్టీ చీఫ్‌ను మార్చే ఆలోచన ఏదైనా ఉందా అని ప్రశ్నించగా ప్రస్తుతానికి ఆ ఆలోచనేది లేదని, ఇప్పుడా విషయం మాట్లాడటం కూడా అర్థం లేదన్నారు. మరోపక్క, ములాయం వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ప్రజలకు ఉన్న వ్యూహాన్ని ములాయం తక్కువ అంచనా వేస్తున్నారని, ప్రజల అవగాహనను ఆయన తక్కువ అంచనా వేస్తున్నారని మండిపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement