మూడు రోజుల్లో రుతుపవనాలు వెనక్కి! | Monsoon may go back in three days ! | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో రుతుపవనాలు వెనక్కి!

Sep 14 2016 9:52 AM | Updated on Sep 4 2017 1:29 PM

మూడు రోజుల్లో రుతుపవనాలు వెనక్కి!

మూడు రోజుల్లో రుతుపవనాలు వెనక్కి!

నైరుతి రుతుపవనాలు మరో 3–4 రోజుల్లో వెనక్కు మళ్లడం ప్రారంభిస్తాయని ఐఎండీ తెలిపింది

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు మరో 3–4 రోజుల్లో వెనక్కు మళ్లడం ప్రారంభిస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం తెలిపింది. ఇప్పటికే దేశంలో సగటు వర్షపాతం లోటు 5 శాతానికి పెరిగింది. ‘రాబోయే 3–4 రోజుల్లో పశ్చిమ రాజస్తాన్‌ నుంచి నైరుతి రుతుపవనాలు తిరిగి వెళ్లడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి’ అని ఐఎండీ తెలిపింది.

అయితే నిజానికి సెప్టెంబరు 1నే రుతుపవనాలు రాజస్తాన్‌ నుంచి వెనక్కు మళ్లాల్సి ఉన్నా, దాదాపు 15 రోజులు ఆలస్యమైంది. ఆసక్తికరంగా, రుతుపవనాలు రాజస్తాన్‌కే ఆలస్యంగా వచ్చి అక్కడి నుంచే ముందుగా వెనక్కు మళ్లుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement