హ్యాపీ బర్త్‌డే సోనియాజీ: మోడీ | Modi wishes Sonia Gandhi on her birthday | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే సోనియాజీ: మోడీ

Dec 10 2013 12:35 AM | Updated on Oct 22 2018 9:16 PM

హ్యాపీ బర్త్‌డే సోనియాజీ: మోడీ - Sakshi

హ్యాపీ బర్త్‌డే సోనియాజీ: మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి రికార్డు సృష్టించారు. ఆశ్చరపోకండి... పరుగులు చేయడంలో కాదు... సామాజిక అనుసంధాన వేదికల్లో... దేశంలోని నెటిజన్లు ఆన్‌లైన్‌లో ఎక్కువగా నరేంద్రమోడీ గురించే మాట్లాడుకున్నారని ఫేస్‌బుక్ సంస్థ తెలిపింది.

అహ్మదాబాద్: భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని సోమవారం ట్వీట్ చేశారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతికి సంతాప సూచకంగా అధికారిక సంతాపదినాలు అమల్లో ఉన్నందున సోనియాగాంధీ(67) ఎలాంటి ఉత్సవాలు జరుపుకోలేదు.
 
 సచిన్‌ను మించిన మోడీ
 న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి రికార్డు సృష్టించారు. ఆశ్చరపోకండి... పరుగులు చేయడంలో కాదు... సామాజిక అనుసంధాన వేదికల్లో... దేశంలోని నెటిజన్లు ఆన్‌లైన్‌లో ఎక్కువగా నరేంద్రమోడీ గురించే మాట్లాడుకున్నారని ఫేస్‌బుక్ సంస్థ తెలిపింది. 2013లో భారతీయ నెటిజన్లు ఎక్కువగా చర్చించిన అంశాలను ప్రస్తావించింది. ఇందులో ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రంజన్, మార్స్ మిషన్‌లు కూడా ఉన్నప్పటికీ ఇవేవీ మోడీ చరిష్మాను అధిగమించలేకపోయాయి. దీంతో ఈ ఏడాది ఫేస్‌బుక్‌లో ఎక్కువమంది మాట్లాడుకున్న వ్యక్తిగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ రికార్డు సృష్టించారు. తర్వాత స్థానం ఇటీవల క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన సచిన్‌ను వరించింది. ఐ-ఫోన్5, ఆర్‌బీఐ గవర్నర్ రఘురాంరంజన్ మూడు,నాలుగు స్థానాల్లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement